నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మందికి గాయాలు హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మందికి తీవ్ర గాయా
నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భవనం రెండో అంతస్తు శ్లాబ్ కూలిపోవడానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.


గాయపడిన వారిని శ్రవణ్, సురేష్, రాజన్ కుమార్, రాజ్ కుమార్, జయ ప్రకాష్, రామ్ సింగ్, సందీప్, సకర్ గా గుర్తించారు. మిగిలిన ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. భారీ లోడ్ కారణంగా కార్మికులు పైకప్పు స్లాబ్ ఐరన్ ఫ్రేమ్ పై రెడీ మిక్స్ కాంక్రీట్ ను పోస్తూ ఉన్నారని పోలీసులు తెలిపారు. నిర్మాణ సంస్థపై నిర్లక్ష్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

0 views